ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా శశిధర్ ఏకగ్రీవ ఎన్నిక
కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: కమ్మర్‌పల్లి మండల ఉపసర్పంచ్‌ల ఫోరం నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా నాగపూర్ గ్రామ ఉపసర్పంచ్ ఉల్లెంగల శశిధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా రాజరాజేశ్వరి నగర్ ఉపసర్పంచ్ డి. ప్రసాద్, కార్యదర్శిగా హాసకొత్తూరు ఉపసర్పంచ్ ఏనుగు మనోహర్ రెడ్డి, సలహాదారుడిగా నర్సాపూర్ ఉపసర్పంచ్ కట్ట రాజ్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఉల్లెంగల శశిధర్ మాట్లాడుతూ, “ఐక్యత మన బలం – సాధనే మన లక్ష్యం” అనే నినాదంతో ముందుకు సాగుతూ ఉపసర్పంచ్‌ల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.మండల ఉపసర్పంచ్‌ల కమిటీ ఏర్పాటుకు సహకరించిన ప్రతి గ్రామ ఉపసర్పంచ్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇనాయత్‌నగర్ ఉపసర్పంచ్ మకిలి అనిల్, ఉప్లూర్ ఉపసర్పంచ్ తక్కురి శేఖర్, అమీర్‌నగర్ ఉపసర్పంచ్ ఎం. శంకర్, డీసీ తాండ ఉపసర్పంచ్ జే. నరేష్, కేసీ తాండ ఉపసర్పంచ్ జి. రమేష్, కొనసముందర్ ఉపసర్పంచ్ బి. శంకర్, బషీరాబాద్ ఉపసర్పంచ్ సీహెచ్. భూమేశ్వర్, చౌటుపల్లి ఉపసర్పంచ్ ఎస్. విశాల్, కోనాపూర్ ఉపసర్పంచ్ మోర్తాడ్ ఉదయ్, కమ్మర్‌పల్లి ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు
