డేటా ఆపరేటర్ల, ఔట్ సోర్సింగ్ల ఉద్యోగ భద్రత కరువు

బాసర, ఆంధ్రప్రభ: రెవెన్యూ శాఖలో గత రెండు దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేక తీవ్ర ఆందోళనకు గురవుతున్నాట్లు మండల కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు ఉమా చరణ్ అన్నారు. గురువారం అయిన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, టైపిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తూ శాఖ కార్యకలాపాల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన వారికి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా విధుల నుంచి తొలగించడం బాధాకరమని అన్నారు.

రెవెన్యూ శకలో భూముల రికార్డుల నిర్వహణ, ధరణి సేవలు, రెవెన్యూ పరిపాలనా కార్యక్రమాలు, ఎన్నికల విధులు, ప్రకృతి విపత్తుల సమయంలో అత్యవసర సేవలు వంటి అనేక కార్యక్రమాల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అంకితభావంతో పనిచేశారు. అయితే 20 సంవత్సరాలుగా సేవలందించిన ఉద్యోగులకు నేడు ఉద్యోగ భద్రత లేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేసారు.

ఇప్పటికే 12 నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాలు తీర్చలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రెవెన్యూ శాఖలో దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న 12 నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు వేడుకొన్నారు.ఇరవై సంవత్సరాల సేవ తర్వాత ఉద్యోగులను రోడ్డున పడేయడం న్యాయం కాదని మా సేవలను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలి. పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి వేలాది కుటుంబాలకు భరోసా కల్పించాలన్నారు.