డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయండి

  • సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.

పాయకాపురం, ఆంధ్రప్రభ: డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అధికారులకు సూచించారు. సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కొరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గురువారం టీడీపీ శ్రేణులతో కలసి ఎమ్మెల్యే బొండా ఉమా డ్రైనేజీ పనులను పరిశీలించారు.స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుని, సంబంధిత ఇంజినీర్లు, అధికారులతో అక్కడికక్కడే సమీక్ష నిర్వహించారు, పెండింగ్‌లో ఉన్న పనులను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.