విద్యుత్ షాక్‌తో ఏఎల్ఎంకు తీవ్ర గాయాలు..

  • మరమ్మతుల సమయంలో ప్రమాదం.. ఆస్పత్రికి తరలింపు

ఏటూరునాగారం, ఆంధ్రప్రభ : ఏటూరునాగారం మండలం గోగుపల్లి గ్రామంలో గురువారం విద్యుత్ మరమ్మతు పనులు నిర్వహిస్తుండగా అసిస్టెంట్ లైన్‌మన్ (ఏఎల్ఎం) మొగిలి విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం, 11 కేవీ బ్రేక్‌డౌన్ మరమ్మతు పనులు చేపడుతున్న సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది బాధితుడిని ఏటూరునాగారం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.