అనారోగ్య బాధిత కుటుంబాలకు సి. ఎమ్. ఆర్. ఎఫ్.
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
పాయకాపురం, ఆంధ్రప్రభ : అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఓవరమని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో 60, 61, 62 డివిజన్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు 8 లక్షల 34 వేలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు టీడీపీ శ్రేణులు సమక్షంలో అందజేశారు.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య చికిత్సల కోసం భారీ మొత్తంలో ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక పెద్ద భరోసాగా నిలుస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గుండె, కిడ్నీ, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న కుటుంబాలకు చికిత్స ఖర్చులు భరించడం కష్టసాధ్యమవుతుందని, అలాంటి సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందుతున్న ఆర్థిక సాయం వారికి కొత్త జీవితం ప్రసాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, 61వడివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఆకుల సూర్య ప్రకాష్ కంచేటి నాగరాజు, ఇంచార్జి దాసరి కనకారావు, గౌస్ బాషా, దొడ్ల చిన్నా, ఎస్. శ్రీను తదితరులు పాల్గొన్నారు.
