మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి: సీఐ బన్సీలాల్

చెన్నూర్, ఆంధ్రప్రభ: యువత గుట్కా, జూదం, గంజాయి, నాటుసారా, గుడుంబా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెన్నూర్ టౌన్ సీఐ బన్సీలాల్ కోరారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కిరాణా దుకాణాల్లో నార్కోటిక్ డాగ్ సహాయంతో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐ బన్సీలాల్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని అన్నారు. నిషేధిత పదార్థాల విక్రయాలు, నిల్వలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని తెలిపారు. ఎవరైనా గంజాయి, గుట్కా లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు కూడా పోలీసులకు సహకరించి, అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారం అందించాలని కోరారు.