గుడుంబా రహిత గ్రామాలే లక్ష్యం..
తొర్రూరు, ఆంధ్రప్రభ : గుడుంబా రహిత గ్రామాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎక్సైజ్ సీఐ బూస అశోక్ తెలిపారు.పట్టణ శివారులో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రూట్ వాచ్ నిర్వహించారు.అనుమానస్పదంగా వెళ్తున్న ఆటోను ఆపి తనిఖీ చేయగా దానిలో పది లీటర్ల గుడుంబా స్వాధీనమైంది. రవాణా చేస్తున్న వ్యక్తి మండలంలోని అమర్ సింగ్ తండాకు చెందిన హపావత్ సుమన్ గా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. వ్యక్తిని అదుపులోకి తీసుకొని గుడుంబాను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆటోను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ….గుడుంబా తయారీకి వినియోగించే ముడిసరుకు రవాణా, విక్రయాలపై నిఘా ఉంచి నిరంతర దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేసులో రెండోసారి పట్టుపడితే బీచ్ కేసు నమోదు, రిమాండ్, జరిమానా విధిస్తామని తెలిపారు. గుడుంబా తయారీ, రవాణా మానుకోకపోతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. నాటు సారా తయారీ వివరాలు తెలిస్తే ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందించాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఎస్సై రవళి రెడ్డి, ట్రైనీ ఎస్సై నాగ అమృత, హెడ్ కానిస్టేబుల్ మధు, కానిస్టేబుళ్లు శశివర్ధన్, సంపత్, శశికాంత్ లు పాల్గొన్నారు.
