బీఆర్ఎస్ నాయకుడిని పరామర్శించిన విజిత్ కుమార్
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వేముల లక్ష్మణ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ మంగళవారం ఆయనను పరామర్శించారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న విజిత్ కుమార్, వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడి అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు.
అలాగే కుటుంబ సభ్యులను ఓదారుస్తూ అధైర్యపడవద్దని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం చికిత్స ఖర్చుల నిమిత్తం తన వంతు ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, లక్ష్మణ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
