Messi Statue Argentina | అతిపెద్ద మెస్సీ విగ్రహం ఆవిష్కరణ

Messi Statue Argentina | అతిపెద్ద మెస్సీ విగ్రహం ఆవిష్కరణ

వరల్డ్‌కప్ విజయ క్షణానికి శిల్పరూపం

Messi Statue Argentina | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని తన ఆటతో మంత్రముగ్ధులను చేసిన అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ కు మరో అరుదైన గౌరవం దక్కింది. అర్జెంటీనాలోని కట్రల్ కో నగరంలో ఏకంగా 85అడుగుల ఎత్తైన భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ విగ్రహానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రపంచకప్‌ను అర్జెంటీనాకు అందించిన చారిత్రాత్మక క్షణాన్ని ప్రతిబింబించేలా ఈ విగ్రహాన్ని ప్రముఖ శిల్పి ఆల్డో బెరోయిసా రూపొందించారు. చేతిలో ప్రపంచకప్ ట్రోఫీని ఎత్తిపట్టుకుని అభిమానులను అభివాదం చేస్తున్న మెస్సీ రూపాన్ని అద్భుతంగా మలిచారు.

భారీ ఎత్తు, కళాత్మక రూపకల్పన, మెస్సీ విజయగాథను ప్రతిబింబించే తీరు కారణంగా ఈ నిర్మాణం ఇప్పుడు అంతర్జాతీయ పర్యాటక ఆకర్షణగా మారుతోంది. ఫుట్‌బాల్ అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు.

2022 ప్రపంచకప్ విజయంతో అర్జెంటీనా ఫుట్‌బాల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మెస్సీకి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక గౌరవాలు లభించాయి. అయితే 85 అడుగుల విగ్రహం మాత్రం ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. సోషల్ మీడియాలో అభిమానులు “ఫుట్‌బాల్ కింగ్‌కు తగిన గౌరవం”, “మెస్సీ లెజెండ్‌కు మహా నివాళి” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.