Syed Abid Ali | టీమిండియా దిగ్గజ ఆల్రౌండర్ ఇక లేరు…

హైదరాబాద్ కు చెందిన భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ (83) కన్నుమూశారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో నివసిస్తున్న అబిద్ అలీ అనారోగ్య సమస్యల కారణంగా ఈరోజు (బుధవారం) తుదిశ్వాస విడిచారు.

1971లో ఓవల్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ విజయంలో సయ్యద్ అబిద్ అలీ ప్రదర్శన చాలా సాధారణంగా నిలిచంది.

1967-68లో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ అరంగేట్రంలో అబిద్ అలీ.. 55 పరుగులకు 6 వికెట్లు పడగొట్టి తన అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు.

ఇక భారతదేశం తరపున ఆడిన 29 టెస్ట్ మ్యాచ్‌లలో 1,018 పరుగులు చేసిన‌ అబిద్.. తన మీడియం పేస్ బౌలింగ్‌తో 47 వికెట్లు పడగొట్టాడు. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడానికి మాత్రమే కాకుండా భారత క్రికెట్‌లో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరిగా కూడా పేరుగాంచాడు. భారతదేశం తరపున ఆడిన ఐదు అత‌ర్జాతీయ‌ వన్డేల్లో 93 పరుగులు చేసి… వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టారు.

అయితే, 1980లో కాలిఫోర్నియాకు వెళ్లే ముందు అబిద్ కొన్ని సంవత్సరాల పాటు హైదరాబాద్‌ జూనియర్‌ జట్టుకు శిక్షణ ఇచ్చారు. 1990 చివరలో మాల్దీవులకు, 2001-02లో రంజీ ట్రోఫీలో సౌత్ జోన్ లీగ్ గెలిచిన ఆంధ్రా జట్టుకు, 2002-2005 మధ్యకాలంలో యూఏఈ జట్టుకు శిక్షణ ఇచ్చారు. కాలిఫోర్నియా వెళ్లిన త‌రువాత‌ స్టాన్‌ఫోర్డ్‌ క్రికెట్‌ అకాడమీలో యువకులకు శిక్షణ ఇస్తున్నారు.

Leave a Reply