బదిలీపై వెళ్లిన కార్యదర్శికి ఘనంగా సన్మానం..
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : బాల్కొండ నియోజకవర్గం లోని భీమ్గల్ మండలంలోని చేంగల్ గ్రామ పంచాయతీ సెక్రెటరీగా ప్రదీప్ బదిలీపై వెళ్లడం జరిగిందని గ్రామ సర్పంచ్ దుమాల మమత రాజు అన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, పంచాయత్ కార్యదర్శి ప్రదీప్ గత ఆరు సంవత్సరాలు ఎనలేని సేవలు అందించి గ్రామ ప్రజల మన్ననలు పొంది మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది.
గత పది రోజుల క్రితం బదిలీపై వేల్పూర్ మండలం కొత్త పల్లికి బదిలీపై వెళ్లడంతో మంగళవారం పంచాయత్ కార్యదర్శి ప్రదీప్ ను చేంగల్ గ్రామ పంచాయతీకి ఆహ్వానించి ఘనంగా శాలువ పూలమాలతో సన్మానించి గ్రామ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞాపిక తో అభినందించారు. అలాగే నూతన బాధ్యతలు తీసుకున్న సెక్రటరీగా వచ్చిన వినయ్ కి గ్రామ సర్పంచ్ దుమాల మమత, గ్రామ శాఖ అధ్యక్షుడు రాజు,ఉపసర్పంచ్ నాతి మోహన్ గౌడ్, అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నూతుల ప్రమీల, పురస్తు గోదావరి, బాయి పావని,నరేష్, గుండారం రజిత, రవి, గుమ్మెర్ల రవళి, సురేష్, పురస్తు దిలీప్, గోలి గంగారం, గుమ్మెర్ల గంగారం, మాడవేని అశోక్, మంద గంగాధర్, తక్కురి నికేష్, కారోబార్ చందు, గ్రామ పంచాయతీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
