బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు..
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు మళ్లీ ఊపందుకున్నాయి. నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలో ముచ్కూర్ సొసైటీ మాజీ చైర్మన్ వెంకటేష్, బాడా భీమ్‌గల్ గ్రామపంచాయతీ 12వ వార్డు సభ్యుడు మాండ్ర సుమన్‌తో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు నెల్ల రంజిత్, మూర్తి, మహేష్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని, ఆ విశ్వాసంతోనే వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో మరిన్ని చేరికలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భీమ్‌గల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ముల్గూరి గణేష్, మాజీ ఉపసర్పంచ్ రాగుల మోహన్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అరిగెల జనార్దన్, 3వ వార్డు కౌన్సిలర్ సతీష్, 7వ వార్డు కౌన్సిలర్ అంజుమ్, బాడా భీమ్‌గల్ గ్రామ శాఖ అధ్యక్షుడు స్వామి, గట్టు సతీష్, శ్రీధర్ గౌడ్, కోమటి శంకర్, కుమ్మరి శంకర్, తెడ్డు అశోక్, డి. మహేష్, సునీల్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.
