Japan Fans Cleanup | మరోసారి ప్రపంచం మనసు గెలుచుకున్న జపాన్ అభిమానులు!

Japan Fans Cleanup | మరోసారి ప్రపంచం మనసు గెలుచుకున్న జపాన్ అభిమానులు!

Japan Fans Cleanup | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఏదైనా క్రీడా ఈవెంట్ చూసేందుకు వెళ్లినప్పుడు, మ్యాచ్ పూర్తి కాగానే అందరం స్టేడియం నుండి బయటకు వచ్చేస్తాం. కానీ ప్రస్తుతం అమెరికా, కెనడా, మెక్సికో దేశాల వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 లో జపాన్ అభిమానులు మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. తమ జట్టు మ్యాచ్ ముగిసిన వెంటనే స్టేడియం ఖాళీ చేసి వెళ్లకుండా, అక్కడి వ్యర్థాలను శుభ్రం చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Japan Fans Cleanup | అసలు ఏం జరిగింది?

గ్రూప్-F లో భాగంగా నెదర్లాండ్స్, జపాన్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరు 2-2 తో డ్రాగా ముగిసింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రేక్షకులంతా స్టేడియం నుంచి బయటకు వెళ్తుండగా, జపాన్ అభిమానులు మాత్రం తమ సీట్ల వద్దే ఉండిపోయారు. చేతుల్లో నీలిరంగు కవర్లు (సంచులు) పట్టుకుని, స్టాండ్స్‌లో పేరుకుపోయిన చెత్తను సేకరించడం ప్రారంభించారు.

వారు కేవలం తాము కూర్చున్న ప్రాంతాన్ని మాత్రమే కాకుండా, ఇతర ప్రేక్షకులు వదిలివెళ్లిన వ్యర్థాలను కూడా బాధ్యతగా ఏరి సంచుల్లో వేశారు. ఎవరూ చెప్పకుండానే, ఎలాంటి ప్రచారం ఆశించకుండా, కెమెరాల కోసం కాకుండా వారు ప్రదర్శించిన ఈ బాధ్యతాయుత ప్రవర్తన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది.

Japan Fans Cleanup

Japan Fans Cleanup | ఎందుకు ఈ విధంగా శుభ్రం చేస్తారు?

తాము ఉపయోగించిన ప్రదేశాన్ని తిరిగి శుభ్రంగా ఉంచడం అనేది జపాన్ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ఆటను, స్టేడియాన్ని మరియు అక్కడ రాత్రింబగళ్లు పనిచేసే మైదాన సిబ్బందిని గౌరవించడమే తమ ముఖ్య ఉద్దేశమని గతంలో జపాన్ అభిమానులు పలు సందర్భాల్లో వెల్లడించారు.

పాఠశాల నుంచే శిక్షణ: జపాన్‌లో చిన్నప్పటి నుంచే పాఠశాలల్లో విద్యార్థులు తమ తరగతి గదులను, పాఠశాల ప్రాంగణాన్ని తామే శుభ్రం చేసుకునేలా అలవాటు చేస్తారు. ఈ విధమైన చిన్ననాటి శిక్షణే వారిని పెద్దయ్యాక కూడా ఇంతటి బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దుతోంది.

గెలుపు లభించినా, ఓటమి ఎదురైనా.. మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియాన్ని శుభ్రం చేయడం అనేది జపాన్ అభిమానులకు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఒక సాంప్రదాయం. తమకు చప్పట్లు, ప్రచారం అక్కర్లేదని.. సమాజం పట్ల బాధ్యత ఉంటే చాలని వారు మరోసారి నిరూపించారు

CLICK HERE TO READ Super start for India | భారత్‌కు సూప‌ర్ స్టార్ట్ !!

CLICK HERE TO READ MORE