Modi France tour | మాక్రాన్‌తో మోదీ భేటీ..
Modi France tour | మాక్రాన్‌తో మోదీ భేటీ..
- భారత్–ఫ్రాన్స్ వ్యూహాత్మక బంధంపై కీలక చర్చలు
- G7 సదస్సు వేదికగా ‘భారత్ ఇన్నోవేట్స్’ ప్రారంభం..
- స్టార్టప్‌లకు గ్లోబల్ ప్లాట్‌ఫామ్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఫ్రాన్స్‌లోని నైస్ (Nice) నగరంలో జరుగుతున్న జీ7 (G7) సదస్సులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ (Modi France tour), ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కీలక ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాక్రాన్ ప్రధాని మోదీకి ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య ఉన్న దశాబ్దాల నాటి వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై ఇద్దరు నేతలు విస్తృతంగా చర్చించారు.
రక్షణ, సాంకేతికత, ఆర్థిక సహకారం వంటి కీలక రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. గ్లోబల్ పరిణామాల నేపథ్యంలో భారత్–ఫ్రాన్స్ సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు.
‘భారత్ ఇన్నోవేట్స్’ ప్రారంభం.. స్టార్టప్‌లకు అంతర్జాతీయ వేదిక
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ సంయుక్తంగా ‘భారత్ ఇన్నోవేట్స్’ (Bharat Innovates) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధి, స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించేందుకు రూపొందించిన ఈ వేదికలో భారత్, ఫ్రాన్స్‌తో పాటు అనేక దేశాల స్టార్టప్‌లు, వెంచర్ క్యాపిటల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
యువ పారిశ్రామికవేత్తలకు గ్లోబల్ అవకాశాలు కల్పించడమే కాకుండా, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ వేదిక కీలక పాత్ర పోషిస్తుందని ఇరు దేశాల నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్–ఫ్రాన్స్ డిజిటల్ భాగస్వామ్యంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
