బాల కార్మిక వ్యవస్థ నిర్ములన అందరి బాధ్యత…
బాల కార్మిక వ్యవస్థ నిర్ములన అందరి బాధ్యత…
- ధర్మపురి జూనియర్ సివిల్ జడ్జి యోగి జానకి…
వెల్గటూర్, ఆంధ్రప్రభ : సమాజంలో బాల కార్మిక వ్యవస్థ ను సంపూర్ణంగా నిర్ములించినప్పుడే మెరుగైన సమాజం సాధ్యపడుతుందని ధర్మపురి జూనియర్ సివిల్ జడ్జి యోగి జానకి అన్నారు.శుక్రవారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో ప్రపంచ బాల కార్మిక నిర్ములన దినోత్సవం పురస్కరించుకుని కొత్తపేట గ్రామంలో నిర్వహించిన బాల కార్మిక చట్టాలపై అవగహన కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి యోగి జానకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… చిన్నారులు బాల్య దశలో వెట్టిచాకిరి లో మగ్గ కూడదన్నా లక్ష్యంతో రాజ్యాంగం పొందపర్చిన చట్టాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
బాల కార్మికుల ను బడిలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించే బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు. అలాగే బాల కార్మిక నిర్ములన తో పాటు బాల్య వివాహాల నివారణ, చిన్నారుల హక్కుల పరిరక్షణపై అవగహన కల్పించారు.గ్రామీణ ప్రాంతాల్లో బాల కార్మికులను గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి సి ఐ రాం నర్సింహారెడ్డి, సర్పంచ్ మహేందర్ రెడ్డి,ఎస్ ఐ ఉదయ్ కుమార్,బార్ అసోసియేషన్ అధ్యక్షులు బందెల రమేష్,ప్రధాన కార్యదర్శి రామడుగు రాజేష్, జాజాల రమేష్,అసిస్టెంట్ లేబర్ అధికారి అనిల్, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.
