Kiran Abbavaram Director Debut | మెగా ఫోన్ ప‌ట్టిన కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram Director Debut | మెగా ఫోన్ ప‌ట్టిన కిరణ్ అబ్బవరం

కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ చిత్రం..
యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న సినిమా

Kiran Abbavaram Director Debut | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: యువ హీరో కిరణ్ అబ్బవరం తన సినీ ప్రయాణంలో మరో కీలక అడుగు వేశారు. నటుడిగా, రచయితగా ఇప్పటికే తన ప్రతిభను చాటుకున్న ఆయన, ఇప్పుడు దర్శకుడిగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. తన కొత్త చిత్రంతో మెగాఫోన్ పట్టిన కిరణ్, కథ మరియు స్క్రీన్‌ప్లే బాధ్యతలను కూడా స్వయంగా నిర్వహించడం విశేషంగా మారింది. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తూనే దర్శకత్వ బాధ్యతలను చేపడుతున్నారు. ఒకేసారి నటుడు, రచయిత, దర్శకుడిగా మూడు కీలక బాధ్యతలను నిర్వర్తిస్తూ తన సృజనాత్మకతను మరోసారి చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ చిత్రాన్ని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ చాగంటి తన కొత్త నిర్మాణ సంస్థ జాయ్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. నిర్మాతగా సుధాకర్ చాగంటికి ఇది తొలి చిత్రం కావడం విశేషం. చిత్ర యూనిట్ వెల్లడించిన వివరాల ప్రకారం, కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే ఇది అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. నటుడిగా విజయాలు అందుకున్న కిరణ్ అబ్బవరం, దర్శకుడిగానూ తనదైన ముద్ర వేస్తారా అన్న ఉత్కంఠ అభిమానుల్లో కనిపిస్తోంది. చిత్రానికి సంబంధించిన హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

Leave a Reply