సీఎం చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం

సీఎం చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం

రేణిగుంట విమానాశ్రయంలో ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు

విజయోత్సవ సభలో పాల్గొనేందుకు దామినేడు బయలుదేరిన ముఖ్యమంత్రి

రేణిగుంట, ఆంధ్ర‌ప్ర‌భ‌: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.

విమానాశ్రయం వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు ముఖ్యమంత్రికి మర్యాదపూర్వకంగా స్వాగతం అందించారు. ముఖ్యమంత్రి రాకతో విమానాశ్రయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.

అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్డు మార్గాన దామినేడు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించనున్నారు. సభకు ఇప్పటికే భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు.