వైటీపీఎస్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగుల జేఏసీ ఆందోళన
వైటీపీఎస్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగుల జేఏసీ ఆందోళన
టెండర్ల ప్రక్రియ నిలిపివేయాలని ప్రభుత్వానికి ఉద్యోగుల డిమాండ్
మిర్యాలగూడ (ఆంధ్రప్రభ): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలంలో గల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్)లో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం వర్షంలోనూ ఆందోళనలు కొనసాగాయి. వైటీపీఎస్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు రెండో రోజూ ప్లాంట్‌లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
“సేవ్ వైటీపీఎస్.. సేవ్ టీజీ జెన్కో” అనే నినాదాలతో ఉద్యోగులు ప్రైవేటీకరణ చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వైటీపీఎస్‌లో ఉద్యోగుల కొరతను సాకుగా చూపిస్తూ ప్రభుత్వం ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైటీపీఎస్ను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించడాన్ని నిరసిస్తూ జెన్కో ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
