Arrest | తాడిపత్రిలో హైటెన్షన్
Arrest | తాడిపత్రిలో హైటెన్షన్
Arrest | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇవాళ రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ చేపట్టిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన వైసీపీ కార్యకర్తలు పోలీసులపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వైసీపీ అధిష్ఠానం పిలుపు మేరకు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించి, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తాడిపత్రికి రావాలని పిలుపునిచ్చారు.
మరోవైపు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల అమలును ప్రజలకు వివరించేందుకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. టీడీపీ శ్రేణులు కూడా భారీ సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. వైసీపీ, టీడీపీలు ఒకేసారి పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడంతో శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందస్తు చర్యగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

