Asian Games 2026 | మను భాకర్‌కు చోటు, సమ్రాట్ రాణా ఔట్

Asian Games 2026 | మను భాకర్‌కు చోటు, సమ్రాట్ రాణా ఔట్

  • ఐచి-నగోయా ఆసియా గేమ్స్‌కు 30 మంది షూటర్ల ఎంపిక

ఆంధ్రప్రభ: జపాన్‌లోని ఐచి-నగోయాలో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే 20వ ఆసియా క్రీడల (Asian Games 2026) కోసం భారత షూటింగ్ జట్టును నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) గురువారం ప్రకటించింది. మొత్తం 30 మంది సభ్యులతో కూడిన జట్టులో 15 మంది పురుషులు, 15 మంది మహిళలకు చోటు కల్పించారు. ఆసియా క్రీడల షూటింగ్ పోటీలు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు ఐచి ప్రిఫెక్చురల్ జనరల్ షూటింగ్ రేంజ్‌లో జరగనున్నాయి.

క్రీడా మంత్రిత్వ శాఖ నిర్దేశించిన అర్హత ప్రమాణాలను ఎంపికైన షూటర్లు అందరూ పూర్తి చేసినప్పటికీ, ఆసియా గేమ్స్ నిర్వహణ కమిటీ విధించిన 30 మంది పరిమితి కారణంగా పలువురు ప్రతిభావంతులు జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. ఈ క్రమంలో సమ్రాట్ రాణా తుది జ‌ట్టులో ఎంపిక కాలేదు.

డబుల్ స్టార్టర్లుగా మను భాకర్, ఈషా సింగ్

వివిధ విభాగాల్లో ఒకే క్రీడాకారుడు పాల్గొనే అవకాశం ఉండటంతో, పతకాల అవకాశాలను పెంచే లక్ష్యంతో నలుగురు షూటర్లను “డబుల్ స్టార్టర్స్”గా ఎంపిక చేశారు. వారిలో మను భాకర్, ఈషా సింగ్, రుద్రంక్ష్ బాలాసాహెబ్ పాటిల్ మరియు విదర్స కె వినోద్ ఉన్నారు.

రైఫిల్, పిస్టల్ విభాగంలో ఎంపికైనవారు

10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (పురుషులు)
పార్థ్ రాకేష్ మానే
హిమాన్షు ధిల్లాన్
రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్

10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (మహిళలు)
ఎలవెనిల్ వలరివన్
సోనం ఉత్తమ్ మస్కర్
విదర్సా కె వినోద్

50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ (పురుషులు)
ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్
నీరజ్ కుమార్
రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్

50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ (మహిళలు)
ఆశి చౌక్సే
విదర్సా కె వినోద్
తిలోత్తమా సేన్

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (పురుషులు)
కేదార్లింగ్ బి. ఉచగాన్వే
గౌరవ్
కమల్జీత్

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (మహిళలు)
సురుచి
ఈషా సింగ్
మను భాకర్

25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ (మహిళలు)
ఈషా సింగ్
మను భాకర్
రాహి సర్ణోబత్
షాట్‌గన్ విభాగంలో ఎంపికైనవారు

ట్రాప్ (పురుషులు)
కైనన్ చెనాయ్
అహ్వర్ రిజ్వీ
శపత్ భరద్వాజ్

ట్రాప్ (మహిళలు)
నీరూ
మనీషా కీర్
ఆశిమా అహ్లావత్

స్కీట్ (పురుషులు)
అనంత్‌జీత్ సింగ్ నరూకా
భావ్‌తేఘ్ సింగ్ గిల్
మైరాజ్ అహ్మద్ ఖాన్

స్కీట్ (మహిళలు)
పరినాజ్ ధలీవాల్
రైజా ధిల్లాన్
మహేశ్వరి చౌహాన్

ఎన్‌ఆర్‌ఏఐ అధ్యక్షుడు కలికేష్ సింగ్ డియో మాట్లాడుతూ.. భారత షూటింగ్‌లో ప్రస్తుతం ఉన్న ప్రతిభ కారణంగా జట్టు ఎంపిక చాలా క్లిష్టంగా మారిందన్నారు. 36 ఈవెంట్లలో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ, 30 మంది పరిమితి కారణంగా ప్రతి విభాగాన్ని జాగ్రత్తగా పరిశీలించి అత్యుత్తమ జట్టును ఎంపిక చేసినట్లు తెలిపారు.

భారత షూటింగ్‌లో ఉన్న లోతైన ప్రతిభ, బహుముఖ సామర్థ్యాలను ప్రతిబింబించేలా ఈ జట్టును రూపొందించామని, ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాలు అందిస్తుందనే నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply