Khammam నిందితుడికి కఠిన శిక్ష విధించాలి

Khammam నిందితుడికి కఠిన శిక్ష విధించాలి

ఖమ్మం (Khammam), ఆంధ్రప్రభ: ఖమ్మం నగరంలో జరిగిన మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటనను యువజన నాయకుడు పారా సాయి ఉదయ్ కిరణ్ తీవ్రంగా ఖండించారు. గురువారం నగరంలోని మమత రోడ్‌లో పీవీ నరసింహారావు సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పారా సాయి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ మైనర్ బాలికపై దాడి చేసిన నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధిత బాలికతో పాటు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు రాఖీబ్, అమ్ము, రిక్కీ, జాతిన్ నాయుడు, లక్కీ నాయుడు, సిద్దు, సోహెల్, వర్షిత్, మనోజ్, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.