Mortad పీఎం శ్రీవిద్య ప్రీ ప్రైమరీ జీవోను వెంటనే రద్దు చేయాలి

Mortad పీఎం శ్రీవిద్య ప్రీ ప్రైమరీ జీవోను వెంటనే రద్దు చేయాలి

మోర్తాడ్/ఏర్గట్ల (Mortad), ఆంధ్రప్రభ: పీఎం శ్రీవిద్య ప్రీ ప్రైమరీ ప్రభుత్వ ఉత్తర్వులను (జీవో) వెంటనే రద్దు చేయాలని అంగన్‌వాడీల జిల్లా అధ్యక్షురాలు కైరి దేవగంగు డిమాండ్ చేశారు.ప్రీ ప్రైమరీ విద్యా విధానాన్ని పూర్తిగా అంగన్‌వాడీ కేంద్రాలకే అప్పగించాలనే డిమాండ్‌తో గురువారం మోర్తాడ్, ఏర్గట్ల మండలాల అంగన్‌వాడీ టీచర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్థానిక ఎమ్మార్వో, మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కైరి దేవగంగు మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ విద్యను అంగన్‌వాడీలకే పరిమితం చేయడం ద్వారా గ్రామీణ స్థాయిలోని చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందుతుందని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వల్ల అంగన్‌వాడీ వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ జీవోను రద్దు చేయాలని, అంగన్‌వాడీల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్, ఏర్గట్ల మండలాల పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply