ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ నాగరాణి
ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ నాగరాణి
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : భీమవరం పీపీ రోడ్డులోని ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్‌లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. గోడౌన్‌కు వేసిన సీళ్లతో పాటు ఈవీఎంల భద్రత, రక్షణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో కలెక్టర్ సంతకం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపుతున్నట్లు తెలిపారు. ఈవీఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు గార్డులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో బి. శివన్నారాయణ రెడ్డి, ఎన్నికల విభాగం ఇన్‌చార్జి సూపరింటెండెంట్ శేఖర్, తెలుగుదేశం పార్టీ తరఫున ఎం. శ్యాంబాబు, జనసేన పార్టీ తరఫున బి. జయశివ, బీజేపీ తరఫున కె. సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
