రైతన్నలారా….ఇకనైనా మారండి

రైతన్నలారా….ఇకనైనా మారండి

  • రసాయన ఎరువులను వాడకండి
  • సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లండి
  • 50 లక్షల బడ్జెట్ లో రూ.2 లక్షల కోట్లు యూరియాకే
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

జమ్మికుంట, ఆంధ్రప్రభ : రసాయన ఎరువుల ద్వారా పండిస్తున్న పంటలను కొని తినడమంటే… పైసలిచ్చి రోగాలను కొని తెచ్చుకోవడమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో ప్రకృతి వ్యవసాయంపై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఇకనైనా రైతులంతా రసాయన ఎరువుల వాడకాన్ని విడనాడి ప్రక్రుతి వ్యవసాయంపై ద్రుష్టి సారించాలని కోరారు. ప్రక్రుతి వ్యవసాయం ద్వారా వచ్చే పంటకు మద్దతు ధర రాదనే బాధ అక్కర్లేదన్నారు.

సేంద్రీయ వ్యవసాయం చేసిన రైతులు కోటీశ్వరులు అయ్యే అవకాశముందన్నారు. కోటి మంది రైతులను ప్రక్రుతి వ్యవసాయంవు మళ్లించడమే ప్రధాని నరేంద్రమోదీ ధ్యేయమన్నారు. మోదీ 4400 రోజుల పాలన పూర్తి నేపథ్యంలో ఆయన స్పూర్తితో రాబోయే రెండేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 25 వేల మంది రైతులను ప్రక్రుతి వ్యవసాయంవైపు మళ్లించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

గోమాత, భూమాత, భరతమాత…నినాదంతో మూడేళ్లపాటు 6 వేల 18 మంది రైతులతో 19 గ్రామాల్లో 10 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ, రాబోయే రోజుల్లో 50 వేల ఎకరాల్లో సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్న జమ్మికుంట క్రుషి విజ్ఝాన కేంద్రం నిర్వాహకులను, సిబ్బందిని మనస్పూర్తిగా అభినందిస్తున్నానన్నారు.

ఏ వస్తువు కొనాలన్నా భయమేస్తుంది

ఇప్పుడు మార్కెట్ లో ఏ వస్తువు కొనాలన్నా భయమేస్తోంది. బియ్యం, పప్పు, నూనె మొదలు పండ్ల దాకా అన్నీ కెమికల్స్. మామిడి పండు మార్కెట్ లో కొని తినడమంటే పైసలిచ్చి రోగాన్ని కొని తెచ్చుకున్నట్లే తయారైంది. హైదరాబాద్ లో మామిడి కాయ తినడంవల్ల ఇద్దరు చనిపోయారు. గత 25 ఏళ్లుగా నాకు జ్వరం దగ్గు లేదు. కానీ హైదరాబాద్ లో పాలు తాగడంవల్ల పాయిజనై 5 రోజులపాటు బెడ్ కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇలాంటి వ్యవసాయం మనకు అవసరమా? సమాజంలో రోగాలకు కారకులం మనమే. నివారణ చేయాల్సిన బాధ్యత మనదే.

బడ్జెట్లో రెండు లక్షల కోట్లు

రైతుల కోసం విదేశాల నుండి పెద్ద ఎత్తున ఎరువులు, పురుగు మందులను దిగుమతి చేసుకుంటున్నామని మీకు తెలుసా. ప్రతి ఏటా ఎరువుల సబ్సిడీ పేరుతో రైతులకు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలను మనం ఖర్చు చేస్తున్నామన్నారు. అందులో విదేశాల నుండి ఎరువులను తెప్పించుకునేందుకే ఏటా 1 లక్షా 20 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామన్నారు. మన దేశ బడ్జెట్ 50 లక్షల కోట్ల రూపాయలైతే అందులో 1 లక్షా 20 వేల కోట్ల సొమ్మును ఎరువుల దిగుమతి కోసమే విదేశాలకు చెల్లిస్తున్నాం. మోదీగారొచ్చాక గత 12 ఏళ్లలో 18 లక్షల కోట్ల సొమ్మును మనం విదేశాలకు చెల్లించి ఎరువులు, పురుగు మందులు తెచ్చుకున్నామన్నారు.

Leave a Reply