జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ ను కలువనున్న బీఆర్ఎస్
జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ ను కలువనున్న బీఆర్ఎస్
ఢిల్లీకి చేరుకున్న బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం
ఢిల్లీ, ఆంధ్రప్రభ : దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ కె. బాలకృష్ణన్ కమిషన్‌తో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం మంగళవారం సమావేశం కానున్నది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఢిల్లీకి చేరుకున్నది. ఈ బృందంలో రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ రాజీవ్ సాగర్, తదితరులు ఉన్నారు.
