యోగాతో రుగ్మతలు దూరం
యోగాతో రుగ్మతలు దూరం
- భీమవరం మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి
- పశ్చిమలో ప్రారంభమైన యోగాంధ్ర పక్షోత్సవాలు
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తే పలు రకాల రుగ్మతల నుండి దూరంగా ఉండవచ్చని భీమవరం మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి తెలిపారు. ఆరోగ్యవంతమైన, ఆహ్లాదకరమైన సమాజ స్థాపన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యోగాంధ్ర సామూహిక కార్యక్రమం చేపట్టిందని అన్నారు. ఆదివారం ఏఎస్ఆర్ నగర్ అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం నందు యోగాంధ్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో భీమవరం మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి యోగాభ్యసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జూన్ 7 నుండి జూన్ 20 వరకు జిల్లాలోని అన్ని ప్రాంతాలలో విస్తృతంగా యోగా సాధన, అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం నాటికి రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది యోగ సాధకులను భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించింది అని అన్నారు. ప్రతినిత్యం యోగ సాధన వలన శారీరక దారుద్యం పాటు ఎన్నో రుగ్మతలను బాగు చేసుకోవచ్చని అన్నారు. యోగా సాధన అనేది కేవలం ఒక రోజులో చేసే ప్రక్రియ కాదని అనునిత్యం చేస్తూ ఉంటేనే శరీరం, మనసు ఆధీనంలో ఉంటాయని అన్నారు. యోగ సాధనను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని అన్నారు.
యోగ సాధనలో విద్యార్థులు, యువత, మహిళలు, మధ్య వయస్కులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతానికి బాధపడాలని అన్నారు. జూన్ 21న జరగబోయే ముగింపు వేడుకల్లో జిల్లా కేంద్రంలో 3వేల మంది యోగ సాధకులతో భారీ యోగా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఎ.రాంబాబు, జిల్లా కోపరేటివ్ అధికారి మురళీకృష్ణ, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి ఏవి సూరిబాబు, చేనేత జౌళి శాఖ అధికారి ఏ.అప్పారావు, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ కీర్తి శ్రవణ్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు, మెప్మా అధికారి నాని బాబు, ఇతర శాఖ అధికారులు, యోగ సాధకులు పాల్గొన్నారు.

