సేవా గుణాన్ని అందరూ అలవర్చుకోవాలి

సేవా గుణాన్ని అందరూ అలవర్చుకోవాలి

  • కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి అనే గుణం అందరికీ కలగాలని ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి అన్నారు. నారాయణపురం గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ఆధ్వర్యంలో నారాయణపురం గ్రామ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కోమటిరెడ్డి లక్ష్మి, అభయ ఫౌండేషన్ చైర్మన్ సుంకు బాలచంద్ర స్వామిజి విచ్చేసి మాట్లాడారు. సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసే ప్రతి ఒక్క సేవా కార్యక్రమానికి ముందు భగవంతుని ప్రార్థిస్తానని అది అందరికీ సేవ చేసే గుణం కలగాలని కోరుకుంటానని ఆమె అన్నారు.

విద్యా, వైద్యం, ఉపాధి, గ్రామంలోని అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కమిటీని ఏర్పాటు చేశామని సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి అన్నారు. ఈ సందర్భంగా సుశీలమ్మ ఫౌండేషన్ నుండి గ్రామ అభివృద్ధికి పది లక్షల రూపాయలు సహకారం అందిస్తానని కోమటిరెడ్డి లక్ష్మి ప్రకటించారు. అభయ ఫౌండేషన్ చైర్మన్ బాలచంద్ర స్వామిజి మాట్లాడుతూ మహిళలకు కుట్టు మిషన్ ఉపాధి, డ్రైవింగ్ శిక్షణ అందించేందుకు పూర్తి సహకారం అందిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ మేధావులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply