తెనాలిలో భక్తి వెల్లువ – వైభవంగా చిన్మయ అమృతోత్సవ శోభాయాత్ర

తెనాలిలో భక్తి వెల్లువ – వైభవంగా చిన్మయ అమృతోత్సవ శోభాయాత్ర

తెనాలి, (ఆంధ్రప్రభ) : పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానందులవారు ప్రారంభించిన జ్ఞానయజ్ఞాలకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చిన్మయ అమృతోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం తెనాలిలో చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు.సుల్తానాబాద్ ఇండస్ట్రియల్ పార్క్‌లోని కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ ఫ్యాక్టరీ నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్రలో గురుదేవుల పాదుకలు, విగ్రహాన్ని గజవాహనంపై ప్రతిష్ఠించి సన్నాయి మేళాలు, కోలాటాలు, నామసంకీర్తనలు మధ్య భక్తులు భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా పాల్గొన్నారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ఈ యాత్రకు మార్గమంతా భక్తులు ఘన స్వాగతం పలికారు.

తెనాలి పాండురంగపేటలోని చిన్మయ మిషన్ కార్యాలయానికి చేరుకున్న అనంతరం పద్మావతి కళ్యాణ మండపంలో గురుపాదుకా పూజ, స్వామిజీల ఆధ్యాత్మిక సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.చిన్మయానంద స్వామిజీ బోధనలు సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించాయని, ఆ సందేశాన్ని భావితరాలకు చేరవేయాలనే లక్ష్యంతో అమృతోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో నిర్మలానందనమ్మ మాతాజీ, సువీరానంద స్వామి, తురీయానంద స్వామి తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమాలను కుమార్ పంప్స్ కొత్త సుబ్రమణ్యం, మాధవి పర్యవేక్షించారు.

Leave a Reply