పశ్చిమలోని అవుట్ ఫాల్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం..
పశ్చిమలోని అవుట్ ఫాల్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం..
ఎమ్మెల్యే సుజన చౌదరి
భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ లోని జెండా చెట్టు, గాంధీ హిల్ అవుట్ ఫాల్ డ్రైనేజీ, నైజాం గెట్ అవుట్ ఫాల్ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు.. నియోజకవర్గ పర్యటనలో భాగంగా శనివారం వన్ టౌన్ జెండా చెట్టు, గాంధీ హిల్ అవుట్ ఫాల్ డ్రైనేజీ సమస్యలను ఎన్డీఏ కూటమి మాజీ కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే సుజనా చౌదరి పరిశీలించారు.
పశ్చిమ లోని అవుట్ ఫాల్ డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం కోసం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి సమగ్రమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

వర్షపు నీరు వెళ్ళటానికి స్టార్మ్ వాటర్ డ్రైన్స్ నిర్మించాలని భారీ వర్షాలకు మురుగునీరు పొంగిపొర్లకుండా రైల్వే ట్రాక్ క్రింద పూడిక తీయించాలని వర్షపు నీరు త్వరగా బయటకు పోయేటట్టు తగిన ఏర్పాట్లు చేయాలని మాజీ కార్పొరేటర్ మహాదేవు అప్పాజీరావు ఎమ్మెల్యే సుజనాకు తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి (దశాబ్దాల క్రితం) వేసిన నైజాం గేట్, గాంధీ హిల్ అవుట్ ఫాల్ డ్రైనేజీ వ్యవస్థను, పెరిగిన జనాభాకు అనుగుణంగా భూగర్భ డ్రైనేజీ పైపులను ఆధునికరించాలని కూటమి మాజీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే సుజనా చౌదరిను కోరారు.
పశ్చిమ లోని అవుట్ ఫాల్ డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి సమగ్రమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే సుజనా చౌదరి వారికి తెలిపారు.కూటమి మాజీ కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, మరుపిళ్ల రాజేష్, అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు, టీడీపీ నాయకులు కొప్పుల గంగాధర్ రెడ్డి బీజేపీ నాయకులు రెడ్డి పల్లి రాజు, మంగళపురి మహేష్ పాల్గొన్నారు.
