ఘనంగా ఛత్రపతి శివాజీ పట్టాభిషేక దినోత్సవం…

ఇచ్చోడ, ఆంధ్రప్రభ : శివాజీ మహారాజ్ పట్టాభిషేకం దినోత్సవ కార్యక్రమాన్ని ఇచ్చోడ మండల కేంద్రంలో ఆరే మరాఠి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.. రాయిఘడ్ కోటలో చత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగి నేటితో 352 సంవత్సరాలు పూర్తవుతుండగా.. అయినా ఇప్పటికీ యావత్ సమాజం ఆ మధుర క్షణాలను గొప్పగా గుర్తుచేసుకుంటుందని సంఘం అధ్యక్షులు సాయికిరణ్ జాధవ్ అన్నారు.

ఆయన మాట్లాడుతూ.. 1674 జూన్ 6 న ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకమహోత్సవం జరిగిందనీ,పట్టాభిషేకం తోనే హైందవ స్వరాజ్యనికి అధికారిక గుర్తింపు లభించిందనీ…ఈ పట్టాభిషేకంతో శివాజీ మహారాజ్ అధికారికంగా “ఛత్రపతి” బిరుదును స్వీకరించి మరాఠా సామ్రాజ్యానికి సార్వభౌమ రాజుగా ప్రకటించబడ్డారనీ తెలిపారు… ఈ కార్యక్రమంలో ఆరే మరాఠి సంఘం ఇచ్చోడ అధ్యక్షులు సాయికిరణ్ జాధవ్, కోశాధికారి మెండల్కర్ లక్ష్మణ్,కార్యదర్శి కదం చంద్రకాంత్, సభ్యులు బాలాజీ సూర్యవంశీ, పవార్ రాజు, చౌహాన్ రజనీకాంత్, హనుమంత్ రావ్ జాధవ్ తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply