Pawan Kalyan Review | పెదపెంకి ఆరోగ్య పరిస్థితులపై పవన్ కల్యాణ్ సమీక్ష
Pawan Kalyan Review | పెదపెంకి ఆరోగ్య పరిస్థితులపై పవన్ కల్యాణ్ సమీక్ష
Pawan Kalyan Review | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజారోగ్య పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. గ్రామంలో వ్యాధుల వ్యాప్తి, నివారణ చర్యలపై సమగ్రంగా సమీక్షించారు.
పెదపెంకి గ్రామంలో ఫైలేరియాతో పాటు డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని పవన్ కల్యాణ్ ఆరా తీశారు. వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.
గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని, దోమల నివారణ చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు. ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
