Manav Suthar | టెస్ట్ అరంగేట్రం చేసిన మానవ్ సుతార్

Manav Suthar | టెస్ట్ అరంగేట్రం చేసిన మానవ్ సుతార్

Manav Suthar |అఫ్గాన్‌తో మ్యాచ్‌లో టెస్ట్ క్యాంప్ అంద‌జేసిన కుల్‌దీప్‌
జ‌ట్టులోకి 23ఏళ్ల ఎడ‌మ చేతి స్పిన్న‌ర్‌
సుతార్‌లో జ‌డేజా స్థానాన్ని భ‌ర్తీ చేసే ట్యాలెంట్

Manav Suthar |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : 23 ఏళ్ల వయసులోనే మానవ్ సుతార్‌కు భార‌త్ త‌ర‌ఫున‌ టెస్ట్ మ్యాచ్ ఆడే అవ‌కాశం ల‌భించింది. రంజీ ట్రోఫీలో పడిన కష్టానికి అత‌నికి ఫ‌లితం ద‌క్కింది. ఎట్టకేలకు టీమిండియా వైట్ జెర్సీని ధరించి తన కలని నిజం చేసుకున్నాడు. అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో రాజస్థాన్‌కు చెందిన ఎడమచేతి వాటం స్పిన్నర్ మానవ్ సుతార్ భారత 319వ టెస్ట్ ఆటగాడిగా అరంగేట్రం చేశాడు. అఫ్గాన్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు మాన‌వ్ సుతార్‌కు టెస్ట్ క్యాప్‌ను కుల్‌దీప్ యాద‌వ్ అంద‌జేశారు. ఎరుపు బంతితో సుదీర్ఘ కాలం పాటు భారత జట్టుకు సేవ చేయగల నమ్మకమైన బౌలర్‌గా మానవ్ సుతార్ నిలుస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో మరిన్ని వైవిధ్యమైన శైలులను నేర్చుకుంటూ, భారత స్పిన్ విభాగానికి ఇతడు పెద్ద బలం కానున్నాడు.

రాజస్థాన్‌కు చెందిన 23 ఏళ్ల మానవ్ సుతార్ దేశీయ క్రికెట్ మరియు ఐపీఎల్, ఇండియా-ఏ టోర్నీల్లో నిలకడైన ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇతను నమ్మకమైన లోయర్-ఆర్డర్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ మాత్రమే కాకుండా, కీలక సమయాల్లో వికెట్లు తీయగల సమర్థుడైన లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్. ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఈ ఏకైక టెస్టులో భారత స్పిన్ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇతనికి తుది జట్టులో అవకాశం దక్కింది.

Manav Suthar

అఫ్గానిస్తాన్‌తో జరిగే టెస్టుకు మానవ్‌ను ఎంపిక చేయడం వెనుక భారత జట్టు మేనేజ్‌మెంట్ ఒక వ్యూహాత్మక ప్రణాళికను రచించింది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటం, అలాగే సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడైన ఎడమచేతి వాటం స్పిన్నర్ అవ్వడం మానవ్‌కు కలిసివచ్చింది. సాంప్రదాయ పద్ధతిలో బంతిని గాల్లో లూప్ చేస్తూ, బ్యాటర్లను పరుగుల చేయకుండా అడ్డుకునే శైలి అతడి సొంతం.

రాజస్థాన్‌కు చెందిన 23 ఏళ్ల ఎడమచేతి స్పిన్నింగ్ ఆల్‌రౌండర్ సుతార్.. 2022 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి 29 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు.. 129 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో సుతార్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్యాట్‌తో సెంచరీ(120) చేయడమే కాకుండా బంతితో మొత్తం ఏడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Leave a Reply