Slum Dog | పోస్టర్ తోనే పిచ్చ హైప్…

Slum Dog | పోస్టర్ తోనే పిచ్చ హైప్…


Slum Dog | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ‎టాలీవుడ్ మాస్ డైరెక్టర్, తనదైన మేకింగ్ స్టైల్‌తో ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న పూరి జగన్నాథ్ మరో సంచలనానికి సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి వచ్చిన అప్‌డేట్ సినీ ప్రియుల్లో మంచి ఉత్కంఠను రేపుతోంది .

‎రా అండ్ రస్టిక్ కథాంశం..
‎ఈ సినిమా పోస్టర్, అలాగే టైటిల్ చూస్తుంటేనే ఇది కమర్షియల్ హంగులతో కూడిన ఒక పవర్‌ఫుల్ డ్రామా అని అర్థమవుతోంది. “రా స్ట్రీట్స్.. రియల్ స్కార్స్.. రూత్ లెస్ ఎమోషన్స్” అనే ట్యాగ్‌లైన్ ఈ సినిమా కథలోని లోతును సూచిస్తోంది. సమాజపు అంచున నివసించే వారి జీవితాలు, వారు ఎదుర్కొనే పోరాటాలు, అక్కడ పుట్టే భావోద్వేగాల చుట్టూ ఈ కథ తిరగబోతున్నట్లు సమాచారం.

‎అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం యొక్క స్ట్రైకింగ్ టీజర్, జూన్ 8వ తేదీ సాయంత్రం 6:00 గంటలకు విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, టబు, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

‎ఈ చిత్రాన్ని కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా, భారీ స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూరి జగన్నాథ్ సినిమా అంటేనే సంభాషణలు, ఎమోషన్స్ ఒక రేంజ్‌లో ఉంటాయి. మరి ఈ ‘స్లమ్ డాగ్’ ద్వారా ఆయన మరోసారి తన మార్క్ చూపిస్తారా అనేది జూన్ 8న టీజర్ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది.

CLICK HERE TO WATCH POSTER

CLICK HERE TO READ Tollywood | బాక్సాఫీస్ షేక్ చేసేందుకు సిద్ధమైన ఇద్దరు స్టార్స్!

CLICK HERE TO READ MORE

Leave a Reply