ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం గ్రామంలో “అమ్మ పేరిట ఒక మొక్క” (ఏక్ పేడ్ మా కే నామ్) కార్యక్రమాన్ని శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కైరంకొండ స్వప్న అశోక్, గ్రామ కార్యదర్శి జ్యోతితో కలిసి గ్రామ పరిధిలో మొక్కలు నాటారు. ​ఈ సందర్భంగా సర్పంచ్ కైరంకొండ స్వప్న అశోక్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు, భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు పెద్ద ఎత్తున వృక్షాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపులో భాగంగా తమకు జన్మనిచ్చిన తల్లిపై ఉన్న ప్రేమ, గౌరవానికి గుర్తుగా ప్రతి ఒక్కరూ ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ నాటి, దానిని సంరక్షించాలని ఆమె కోరారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మొక్కల పాత్ర కీలకమని గ్రామ సెక్రటరీ జ్యోతి పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు పిల్లలమర్రి సుజాత, మాడూరి నగేష్, రచ్చ ఉపేందర్, పిష్క సంజీవ కుమార్, గడ్డం అశోక్, సాయి, మురళి, నర్సింహా, సర్వయ్య, శ్రవణ్, గౌతమ్, ప్రసాద్, పావని, సునీత, వరలక్ష్మి, రాజు, శ్రీనివాస్, మల్లయ్య, పల్లవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply