Land Grab Case | ప్రభుత్వ భూముల కబ్జా కేసులో…

Land Grab Case | ప్రభుత్వ భూముల కబ్జా కేసులో…

Land Grab Case | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ప్రభుత్వ భూముల కబ్జా కేసులో పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ శివారులోని గండిపేట ప్రాంతంలో ప్రభుత్వ భూములకు సంబంధించిన అక్రమాల కేసులో ఆయనపై ఆరోపణలు ఉండటంతో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.

బొల్లా బ్రహ్మనాయుడు తమిళనాడులోని కాంచీపురంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న సైబరాబాద్‌ పోలీసులు ప్రత్యేక బృందంతో అక్కడికి వెళ్లి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తరలించినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌ శివారు గండిపేటలో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాజేసేందుకు నకిలీ జీవోలు సృష్టించినట్లు బ్రహ్మనాయుడుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భూముల అక్రమ బదలాయింపు, నకిలీ పత్రాల సృష్టి వంటి అంశాలపై విచారణ చేపడుతున్నట్లు సమాచారం.

Leave a Reply