పొలాలకు బంగారంలా మారనున్న చెరువు మట్టి..!

పొలాలకు బంగారంలా మారనున్న చెరువు మట్టి..!

రాప్తాడు, ఆంధ్రప్రభ: చెరువుల నుంచి వెలికితీసే పూడిక మట్టిని రైతులు తమ పొలాలకు తరలించుకొని భూములను సారవంతం చేసుకోవాలని ఎంపీడీవో విజయలక్ష్మి సూచించారు.

గురువారం రాప్తాడు మండలంలోని పుల్లలరేవు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్ మిషన్ నిధులతో రూ.6 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు ప్రజల వినియోగానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

జలధార–జలహారతి కార్యక్రమంలో భాగంగా గ్రామ చెరువులో పూడికతీత పనులను ప్రారంభించినట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకం కూలీలు చెరువులో నుంచి తీసిన మట్టిని రైతులు స్వచ్ఛందంగా ట్రాక్టర్ల ద్వారా తమ పొలాలకు తరలించుకొని భూముల సారాన్ని పెంచుకోవాలని సూచించారు.

ట్రాక్టర్లు ఉన్న రైతులు పేద రైతులకు ఉచితంగా మట్టిని తరలించేందుకు సహకరించాలని కోరారు. గ్రామ ప్రజాప్రతినిధులు, పెద్దలు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు కలిసి కంపచెట్ల తొలగింపు కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు.

పనులకు వెళ్లే కూలీల సౌకర్యార్థం మట్టి రహదారిని పునరుద్ధరించినట్లు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.

చెరువు పూడికతీత వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు రైతుల పొలాల్లోని బోరుబావుల్లో నీటి మట్టం మెరుగుపడుతుందని తెలిపారు. ఇది వ్యవసాయాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మైనర్ ఇరిగేషన్ ఏఈ కృష్ణకుమార్, తెలుగు రైతు అధ్యక్షుడు గోపాల్, ఏపీవో ఏ. సావిత్రి, పంచాయతీ కార్యదర్శి వినోద్ కుమార్, టెక్నికల్ అసిస్టెంట్ హజారా విజయ్, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఫొటో క్యాప్షన్: పుల్లలరేవు గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లను పరిశీలిస్తున్న అధికారులు.

Leave a Reply