ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నం

ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నం

  • గ్రామసభలో పెట్రోల్ పోసుకున్న వ్యక్తి
  • జాబితాలో పేరు లేదని నిరసన
  • గ్రామస్థుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

కాటారం, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుండాత్‌పల్లి గ్రామపంచాయతీలో గురువారం నిర్వహించిన గ్రామసభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందిరమ్మ ఇల్లు మంజూరు జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.గ్రామానికి చెందిన నగునూరి శ్రీనివాస్ గతంలో ప్రకటించిన ఎంపిక జాబితాలో తన పేరు ఉన్నప్పటికీ, తాజాగా గ్రామసభలో వెల్లడించిన లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కావాలనే కొందరు నాయకులు, అధికారులు తన పేరును జాబితా నుంచి తొలగించారని ఆరోపిస్తూ గ్రామసభ మధ్యలోనే తనపై పెట్రోల్ పోసుకున్నాడు.

శ్రీనివాస్ చర్యను గమనించిన గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు వెంటనే అప్రమత్తమై అతడిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. సంఘటనతో గ్రామసభలో ఒక్కసారిగా కలకలం రేగింది. అనంతరం అక్కడున్న అధికారులు, స్థానిక నాయకులు శ్రీనివాస్‌ను శాంతింపజేసి సమస్యను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై గ్రామసభలో కొంతసేపు వాగ్వాదాలు చోటుచేసు కున్నాయి. తనకు న్యాయం చేయాలని శ్రీనివాస్ అధికారులను కోరగా, సంబంధిత అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఘటనపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply