Jobs | రోడ్లు, భవనాల శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ
Jobs | రోడ్లు, భవనాల శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ
తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 222 ఏఈఈ (సివిల్) ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టుల్లో 112 పోస్టులు మల్టీజోన్ 1లో, 110 పోస్టులు మల్టీజోన్ 2లో ఉన్నాయి. బీఈ, బీటెక్ సివిల్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జూన్ 6 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ లేదా బీటెక్ ఇంజినీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లేదా అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఏఎంఐఈ)లో అర్హత కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జులై 1, 2026 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో జులై 13, 2026వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు రూ.500 చొప్పున చెల్లించాలి. దీనితో పాటు అదనంగా పరీక్ష ఫీజు కింద మరో రూ.120 ప్రతి ఒక్కరూ చెల్లించాలి. నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు జీతంగా చెల్లిస్తారు.
