భూక్య తండాలో ఇద్దరు మహిళలు అనుమానాస్పద మృతి

మరిపెడ, ఆంధ్రప్రభ : మండలంలోని భూక్య తండాలో మంగళవారం రాత్రి అనుమానస్పద స్థితిలో ఇద్దరు వివాహితులు మృతి చెందారు. మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్ తెలిపిన వివరాలు ప్రకారం.. భూక్య తండాకు చెందిన మాలోత్ శారద 40 మాలోత్ నీల (39) ఇద్దరూ ప్రక్క ప్రక్కనే నివాసం ఉంటున్నారు. శారద సోమవారం సూర్యపేట కంటి హాస్పిటల్ వెళ్లి పరీక్ష చేయించుకొని తిరిగి సాయంత్రం తండాకు చేరుకుంది అనంతరం ఇద్దరు స్నేహితులు ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటూ మాలోతు నీల కళ్ళు తిరుగుతున్నాయంటూ ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితిలోకి జారుకుంది.

ఆమెను శారద సిపిఆర్ చేస్తుండగా ఇద్దరూ అపస్మారక స్థితికి వెళ్లారు. గమనించిన కుటుంబ సభ్యులు ఇద్దరిని ప్రైవేట్ వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మద్యంలో మృతి చెందారు రాత్రి మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి వైద్యుడు పరిశీలించి కార్డియా ఖర్చుతో లేదా వడదెబ్బ కారణంగా చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేశారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పూర్తి వివరాలను ఆ టాప్సి నివేదిక అందిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని ఎస్సై తెలిపారు. సూర్యాపేట నుంచి తిరిగి వస్తూ శారద మద్యం బాటిల్ కొనుగోలు చేయగా ఇద్దరు శారద ఇంట్లో మద్యం సేవించిన అనంతరం అపస్మారక స్థితికి చేరుకున్నట్లు సమాచారం. ఆ కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నట్లు తాండవాసులు తెలిపారు.

Leave a Reply