డిప్యూటీ సీఎం చేతుల మీదుగా చెక్కు అందజేత..
బాసర, (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ ; బాసరలో లైన్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్‌పీడీసీఎల్ ఉద్యోగి ప్రమోద్ కుమార్ గత సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించారు.బాసర యూనియన్ బ్యాంక్ లో ఇన్సూరెన్స్ కలిగి ఉండడంతో బుధవారం రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అశీష్ పాండే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ కె. అరుణ సవిత, బాసర శాఖ మేనేజర్ విజయ్ కుమార్
చేతుల మీదుగా నామినీ స్వప్న కు ఒక కోటి రూపాయల బీమా క్లెయిమ్ చెక్కును అందజేశారు. కష్టకాలంలో ఖాతాదారుల కుటుంబాలకు సకాలంలో ఆర్థిక సహాయం మద్దతు అందించాలనే బ్యాంకు నిబద్ధతను ప్రతిభంబిస్తుందని ఉపముఖ్యమంత్రి అన్నారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ అధికారులు పాల్గొన్నారు.
