పంట పొలాల నుండి కేబుల్ వైర్ల చోరీ…
పంట పొలాల నుండి కేబుల్ వైర్ల చోరీ…
సుమారు 30 మంది రైతుల కేబుల్ వైర్ల,స్టార్టర్,బాక్స్ లను ఎత్తుకెళ్లిన దొంగలు
దొంగలపై పోలీసులు పటిష్ట నిఘ పెట్టాలన్న రైతులు
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్ గ్రామంలో ఎల్లమ్మ వాగు దగ్గర, సికింద్రాపూర్ రోడ్, రైతుల వ్యవసాయ మోటార్ కేబుల్ వైర్లు,స్టార్టర్లు బాక్స్ లు చోరీకి గురయ్యాయి…గ్రామానికి చెందిన సుమారు 30 మంది రైతులు వారి వ్యవసాయ మోటార్ వైర్ల లు,స్టార్టర్ లను దొంగలు కత్తిరించుకు పోయారని అన్నారు. బుధవారం ఉదయం పంట పొలాలకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన రైతులు గమనించారు.మొత్తం సుమారు 30 మోటార్ లకు సంబంధించిన వైర్లు కత్తిరించారని రైతులు గంగారం, ముచ్కూర్ నవీన్, రావుల మైపాల్, పల్లె గంగాధర్, ఉప్పు గంగాధర్, కుమ్మరి ప్రశాంత్, గణపయ్ మోహన్,గంపాయ్ గంగ మోహన్, సందు సుమన్, కుమ్మరి శివ,కుమ్మరి గంగాధర్, సందు గంగాధర్,మిగతా రైతులు దాదాపు రెండు లక్షల 50వేల విలువ కలిగిన వైర్లు, స్టార్టర్,బాక్స్ లను ఎత్తుకెళ్లడంతో రైతులు వాపోతున్నారు. పోలీసులు పటిష్ట నిఘా పెట్టి నిదతులను పట్టుకోవాలని కోరుతున్నారు.
