New Trend | ఇది ఫాలో అయితే.. మీ గ్రూప్ లో మీరే ఫ్యాష‌న్ ఐకాన్ !!

New Trend | ఇది ఫాలో అయితే.. మీ గ్రూప్ లో మీరే ఫ్యాష‌న్ ఐకాన్ !!

ఆంధ్రప్రభ వెబ్ ప్రత్యేకం : కొత్త అకడమిక్ ఇయర్ వచ్చేసింది! కాలేజీ క్యాంపస్‌లు సరికొత్త సందడితో కళకళలాడుతున్నాయి. క్లాస్‌రూమ్‌లలో కొత్త ఫ్రెండ్స్ పరిచయాలు, సీనియర్ల పలకరింపులు, అన్నిటికంటే ముఖ్యంగా త్వరలోనే రాబోయే ‘ఫ్రెషర్స్ పార్టీల’ జోష్ ఇప్పుడే మొదలైంది. కాలేజీలో అడుగుపెట్టిన మొదటి రోజే లేదా ఆ ఫస్ట్ పార్టీలోనే అందరి దృష్టి మనపై పడాలి, లైమ్‌లైట్ అంతా మనమే కొట్టేయాలి అనుకోవడం కామన్.

అయితే, 2026లో ఫ్యాషన్ డెఫినేషన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఫ్యాషన్ అంటే కేవలం ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు వేసుకోవడం కాదు బాస్… ఇట్స్ యాన్ అటిట్యూడ్! కంఫర్ట్, కాన్ఫిడెన్స్, క్రియేటివిటీ కలగలిసిన “నా స్టైల్… నా ఐడెంటిటీ” అనే కాన్సెప్ట్‌తో నేటి జెన్-జీ (Gen-Z) యువత దూసుకుపోతోంది. కాలేజీ క్యాంపస్ కారిడార్స్ నుంచి సోషల్ మీడియా రీల్స్ వరకు ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ క్రేజీ ట్రెండ్స్ ఏంటో చూసి, మీ వార్డ్‌రోబ్‌ను అప్‌డేట్ చేసుకోండి.

ప్రస్తుతం కాలేజీ కుర్రకారును విపరీతంగా ఊపేస్తున్న నంబర్ వన్ ట్రెండ్.. ‘ఓవర్‌సైజ్ టీ-షర్ట్స్ అండ్ బ్యాగీ జీన్స్ కాంబో’. బాడీకి అతుక్కుపోయే టైట్ ఫిట్టింగ్స్ కాలం ఎప్పుడో పోయింది, ఇప్పుడు అంతా ‘లూజ్ అండ్ కంఫర్ట్’ స్టైల్ నడుస్తోంది.

బాడీ షేప్‌తో సంబంధం లేకుండా ఫుల్ రిలాక్స్‌డ్‌గా ఉండే ఓవర్‌సైజ్ గ్రాఫిక్ టీ-షర్ట్స్, అనిమే (Anime) డిజైన్లు, ఓల్డ్-స్కూల్ వింటేజ్ లోగోలు ఉన్న టాప్స్ యువతకు ఫేవరెట్‌గా మారాయి. వీటికి పర్ఫెక్ట్ మ్యాచ్‌గా 90ల నాటి బ్యాగీ జీన్స్ , మల్టీ-పాకెట్ కార్గో ప్యాంట్లు మళ్లీ రీఎంట్రీ ఇచ్చాయి. ఈ స్ట్రీట్-స్టైల్ లుక్ కాలేజీకి రెగ్యులర్‌గా వెళ్లడానికి సూపర్ క్లాసీగా ఉండటమే కాకుండా, క్యాంపస్‌లో మిమ్మల్ని చాలా కూల్‌గా ప్రెజెంట్ చేస్తుంది.

ఇక ఫ్రెషర్స్ పార్టీల విషయానికి వస్తే, ఏ దుస్తులు సెలెక్ట్ చేసుకోవాలనే కన్ఫ్యూజన్‌కు బెస్ట్ ఆప్షన్ ‘కో-ఆర్డ్ సెట్స్’ (Co-Ord Sets). ఒకే రంగు లేదా ఒకే రకమైన ఫ్యాబ్రిక్ డిజైన్‌తో వచ్చే ఈ మ్యాచింగ్ సెట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేయాలన్నా, ఫ్రెషర్స్ డే నాడు ఫోటోలకు పోజులివ్వాలన్నా ఇవి ఇన్ స్టంట్‌గా ఒక హై-ఫ్యాషన్ లుక్‌ను ఇస్తాయి. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ వంటి రెగ్యులర్ రంగుల బోర్ కొట్టేయడంతో.. ప్రస్తుతం లావెండర్, లైట్ బ్లూ, పీచ్, మింట్ గ్రీన్, క్లాసిక్ బేజ్ వంటి ‘పాస్టెల్ షేడ్స్’ మార్కెట్‌ను ఏలుతున్నాయి. ఈ లైట్ కలర్స్ మిమ్మల్ని గుంపులో చాలా ప్రత్యేకంగా, ఎలిగెంట్‌గా చూపిస్తాయి.

మరోవైపు, సంప్రదాయానికి కాస్త మోడ్రన్ ట్విస్ట్ ఇస్తూ.. ఈ అకడమిక్ ఇయర్‌లో ఇండో-వెస్ట్రన్ స్టైల్’ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కాలేజీ ఈవెంట్లలో లాంగ్ కుర్తా కింద ప్యాంట్‌కు బదులుగా బ్లూ జీన్స్ వేసుకోవడం, లేదా డెనిమ్ జాకెట్ కింద ట్రెడిషనల్ వేర్ ట్రై చేయడం నేటి యూత్‌కు ఒక క్రేజీ అలవాటుగా మారింది. దీనికి తోడుగా ‘సస్టైనబుల్ ఫ్యాషన్’ (Eco-Friendly) పట్ల కూడా అవగాహన పెరుగుతోంది. కేవలం స్టైల్ మాత్రమే కాదు, ప్రకృతికి హాని చేయని రీసైకిల్డ్ ఫ్యాబ్రిక్, ఆర్గానిక్ కాటన్ దుస్తులను ఎంచుకుంటూ తమ బాధ్యతాయుతమైన వ్యక్తిత్వాన్ని చాటుకుంటున్నారు.

చివరగా, మీరు ఎలాంటి అవుట్‌ఫిట్ వేసుకున్నా దానికి సరైన ముగింపు ఇచ్చేది మీ ‘షూస్, యాక్సెసరీస్’ మాత్రమే. ఇప్పుడు ప్రతి కాలేజీ స్టూడెంట్ అల్మారాలో ఒక ‘బ్రాండెడ్ వైట్ స్నీకర్’ కచ్చితంగా ఉంటోంది. దాంతో పాటు చంకీ షూస్, కలర్‌ఫుల్ స్పోర్ట్స్ స్నీకర్స్ యూత్ స్టైల్‌లో కీలక భాగమయ్యాయి. వీటికి తోడుగా రెట్రో సన్‌గ్లాసెస్, మెడలో సిల్వర్ చైన్స్, స్మార్ట్‌వాచ్‌లు, తలపై క్యాప్స్, బాడీకి క్రాస్‌గా తగిలించుకునే స్లింగ్ బ్యాగ్స్ (Crossbody Bags) ఉంటే మీ లుక్ కంప్లీట్ అయినట్లే. సో.. ఇంకెందుకు ఆలస్యం, ఈ 2026 ట్రెండ్స్ ఫాలో అయిపోండి, మీ కాలేజీలో సరికొత్త ఫ్యాషన్ ఐకాన్‌గా మారిపోండి!

Leave a Reply