అతివేగం మూగజీవాన్ని బలితీసుకుంది
అతివేగం మూగజీవాన్ని బలితీసుకుంది
భృగుబండ-మొక్కపాడు రోడ్డుపై టాటా ఏస్ ఢీకొని గేదె మృతి
సత్తెనపల్లి, ఆంధ్రప్రభ: భృగుబండ-మొక్కపాడు రోడ్డుపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక గేదె మృతి చెందింది. అతివేగంగా దూసుకొచ్చిన వాహనం మూగజీవాన్ని బలితీసుకుంది. స్థానిక రైతులు తమ గేదెలను ఇళ్లకు తోలుకెళ్తుండగా మొక్కపాడు వైపు నుంచి వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం వాటిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక గేదె తీవ్రంగా గాయపడింది.
వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన గేదె అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న స్థానికులు, రైతులు ఘటనాస్థలానికి చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ రహదారులపై వాహనాలు అతివేగంగా వెళ్తుండటంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మూగజీవాల రక్షణ కోసం వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని స్థానికులు కోరుతున్నారు.
