ఉప్లూర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

ఉప్లూర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ శైలేందర్

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అమరవీరులకు నివాళులర్పించారు.

అనంతరం సర్పంచ్ శైలేందర్ మాట్లాడుతూ.. ఎందరో తెలంగాణ అమరవీరుల త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలనతో ముందుకు సాగుతోందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం బాటలు వేస్తోందని ఆయన పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ట్రిబ్యునల్ మెంబర్ బాస వేణుగోపాల్ యాదవ్, ఉప సర్పంచ్ తక్కురి శేఖర్, పంచాయతీ కార్యదర్శి సౌందర్య, వార్డు సభ్యులు అనిల్, అజయ్, రాకేష్, సంతోష్, అంజిత్, సాధుల్లా పాల్గొన్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రధాన కార్యదర్శి ఏలేటి మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు తిప్పిరెడ్డి శ్రీనివాస్, డాక్టర్ నరేష్, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply