బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జాతీయ జెండా ఆవిష్కరించిన మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కమ్మర్‌పల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రేగుంట దేవేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అమరవీరుల త్యాగాలు, ప్రజల చిరకాల ఆకాంక్షలు, కేసీఆర్ నాయకత్వంలో సాగిన ఉద్యమ ఫలితమని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మైలారం సుధాకర్, వీడీసీ చైర్మన్ మల్యాల సుభాష్ గౌడ్, అహ్మద్, హనీఫ్, రేంజర్ల మహేందర్, సుంకరి మురళి, తీగల హరీశ్, బద్రి, శ్రీను, సంత రాజేశ్వర్, నరేందర్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply