అక్రమ మద్యం విక్రయాలపై పోలీసుల దాడులు

అక్రమ మద్యం విక్రయాలపై పోలీసుల దాడులు

ఇద్దరి అరెస్ట్.. భారీగా మద్యం సీసాలు స్వాధీనం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంతంగి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నమ్మదగిన సమాచారం మేరకు చౌటుప్పల్ పోలీస్ సిబ్బంది కృష్ణమాల్, పి. రవీందర్‌తో పాటు ఇతర సిబ్బంది కలిసి పంతంగి గ్రామ పరిధిలోని పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు.

పంతంగి గ్రామానికి చెందిన అంతటి గణేష్ వద్ద నుంచి 5000 బీర్లు 12, కేఎఫ్ బీర్లు 2, కాయ్ కాయ్ వైన్ 180 ఎంఎల్ సీసాలు 94, ఓసీ వైన్ 180 ఎంఎల్ సీసాలు 39, ఐబీ వైన్ 180 ఎంఎల్ సీసాలు 18 స్వాధీనం చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన కాకి పాండు వద్ద నుంచి కేఎఫ్ బీర్లు 14, కాయ్ కాయ్ వైన్ 180 ఎంఎల్ సీసాలు 40 స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుతుండటంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను పోలీస్ స్టేషన్‌కు తరలించి, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Leave a Reply