Pawan Kalyan | తెలంగాణపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan | తెలంగాణపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: తెలంగాణపై తనకున్న అనుబంధం రాజకీయాలకు అతీతమని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ నుంచి తాను పోరాట స్ఫూర్తిని పొందానని, తన సినిమాల్లోనూ తెలంగాణ ఆత్మ కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే తన ఆకాంక్ష అని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నేలతో తన అనుబంధం కొత్తగా వచ్చినది కాదని స్పష్టం చేశారు.

“జనసేనకు తెలంగాణతో సంబంధం ఏమిటి?” అని కొందరు ప్రశ్నిస్తున్నారని పవన్ అన్నారు. జనసేనలో తెలంగాణ నుంచి వచ్చిన నాయకులు, సైనికులు ఉన్నారని, తెలంగాణపై తన గుండెల్లో ఉన్న ప్రేమ రాజకీయాల కోసం తెచ్చుకున్నది కాదని పేర్కొన్నారు.

విభజన తర్వాత వచ్చిన ప్రేమ కూడా కాదని, ప్రత్యేక రాష్ట్ర ఆలోచన రావడానికి ముందే తెలంగాణ తనకు పోరాట స్ఫూర్తిని ఇచ్చిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల త్యాగాలు, పోరాటం తనకు ఎప్పుడూ ప్రేరణగా నిలిచాయని ఆయన అన్నారు.

తెలంగాణ అభివృద్ధి, ప్రజల గౌరవం, రాష్ట్ర భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.