పోలీస్ శాఖలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు..

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులర్పించారు. రాష్ట్ర అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు సేవలందిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ చేతుల మీదుగా సేవా పతకాలు ప్రదానం చేశారు. అలాగే పోలీస్ సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, డీపీఓ సిబ్బంది, ఆర్‌ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
