Ebola | ప్రయాణికులకు కేంద్రం అడ్వైజరీ

Ebola | ప్రయాణికులకు కేంద్రం అడ్వైజరీ

Ebola | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ దేశాలకు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించింది.

కేంద్ర ప్రభుత్వం సూచనల ప్రకారం, కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్‌కు వెళ్లే వారు లేదా ఆ దేశాల్లో ఉన్న భారత పౌరులు స్థానిక ఆరోగ్య అధికారుల మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. అలాగే జ్వరం, తీవ్రమైన అలసట, కండరాల నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఇతరులకు దూరంగా ఉండి వైద్య సహాయం పొందాలి.

గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత ప్రాంతాలకు వెళ్లినవారు లేదా ఆ ప్రాంతాల మీదుగా ప్రయాణించినవారు తమ ఆరోగ్య పరిస్థితిని జాగ్రత్తగా గమనించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అనుమానాస్పద లక్షణాలు ఉంటే స్థానిక ఆరోగ్య అధికారులను సంప్రదించడం మంచిదని పేర్కొంటున్నారు.

భారతదేశంలో ఇప్పటివరకు బుండిబుగ్యో స్ట్రెయిన్‌ వల్ల ఎబోలా కేసు నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ, అంతర్జాతీయ ప్రయాణాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు అవసరమని హెచ్చరించింది.

Leave a Reply