Pawan Kalyan Sabha | కోర్టులో కీలక పిటిషన్

Pawan Kalyan Sabha | కోర్టులో కీలక పిటిషన్

Pawan Kalyan Sabha | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్‌: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో నిర్వహించాలనుకుంటున్న బహిరంగ సభకు అనుమతుల అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సభ నిర్వహణకు పోలీసుల నుంచి అనుమతి ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ మేరకు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రార్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సభకు అనుమతి లభిస్తుందా లేదా అన్న దానిపై జనసేన వర్గాల్లో టెన్షన్ నెలకొంది.

మరోవైపు ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమ వాదనలు వినకుండా పవన్ కళ్యాణ్ సభకు అనుమతులు ఇవ్వకూడదంటూ సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది.

Leave a Reply